లక్షకు పైగా చైనా సీసీ కెమెరాల తొలగింపు

లక్షకు పైగా చైనా సీసీ కెమెరాల తొలగింపు

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో నగరంలో అమర్చిన 1.4 లక్షల సీసీ కెమెరాలను తొలగించనుంది. ఇవన్నీ చైనాలో తయారైన కెమెరాలే. వీటి స్థానంలో కొత్తవి భర్తీ చేయనున్నారు. ఆప్‌ ప్రభుత్వంలో ఫేజ్‌-1 కింద 2020 నుంచి 2022 మధ్య ఈ సీసీ కెమెరాలను నెలకొల్పారు. ఢిల్లీలో మొత్తం 2.7 లక్షల సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి.