VIDEO: రోడ్లకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ పనులు
AKP: మాకవరపాలెం మండలం ముషిడిపాలెం పంచాయతీ బుచ్చన్నపాలెం గ్రామంలో జంగిల్ క్లియరెన్స్ పనులు జరిగాయి. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో గురువారం బ్లేడ్ డాక్టర్ల ద్వారా రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను, తుప్పలను తొలగించారు. అంతేకాకుండా రోడ్లపై ఏర్పడ్డ గోతులను పూడ్చారు. పదివేల వరకు చందాలు స్వీకరించి ఈ కార్యక్రమం చేపట్టినట్టు యువకులు తెలిపారు.