బక్రీద్ పండుగకు పటిష్ట భద్రత: ఎస్పీ

NRPT: బక్రీద్ పండుగ సందర్భంగా నారాయణపేట జిల్లాలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ప్రార్థన మందిరాలు, ఈద్గా వద్ద పోలీసులను ఏర్పాటు చేశామని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టామని అన్నారు. పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పారు.