స్వామివారిని దర్శించుకున్న పారిశ్రామిక వేత్త
W.G: పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామివారిని స్విట్జర్‌లాండ్ సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈఓ, పాలకొల్లుకు చెందిన బి.సత్యనారాయణ రాజు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మీసాల రామచంద్రరావు, సూపరింటెండెంట్ వాసు, తదితరులు పాల్గొన్నారు.