VIDEO: అధికారుల నిర్లక్ష్యంతో యువరైతు మృతి

సూర్యపేట: జిల్లాలోని ఆత్మకూరు (S) మండలం పిపానాయక్ తండా గ్రామపంచాయతీలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఒక యువ రైతు బలి అయ్యాడు. పొలంలో కరెంటు తీగ కింది నుండి పోతున్నా పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు. దీంతో తెల్లవారుజామునే పొలంకు వెళ్లిన యువరైతు కరెంటు తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.