విమాన సర్వీసులపై ఆకాశ ఎయిర్‌లైన్స్ ప్రకటన!

విమాన సర్వీసులపై ఆకాశ ఎయిర్‌లైన్స్ ప్రకటన!

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పలు దేశాలకు విమానాల రద్దు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆకాశ ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన చేసింది. అబుదాబికి తమ విమాన సేవలను తిరిగి ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అనుకూలమైన పరిస్థితులను సమీక్షిస్తున్నామని చెప్పింది. కువైట్, రియాద్, దోహా ప్రాంతాలకు విమాన రాకపోకల నిలిపివేత ఏప్రిల్ 12 వరకు కొనసాగనున్నట్లు పేర్కొంది.