అద్దేపల్లిలో పోలీసుల కార్డన్ సెర్చ్

అద్దేపల్లిలో పోలీసుల కార్డన్ సెర్చ్

BPT: భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లిలో రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 11 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మాదకద్రవ్యాల నిరోధంతో పాటు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకే జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ సోదాలు చేపట్టినట్లు తెలిపారు.