ఎద్దు దాడిలో యువ రైతు మృతి

ఎద్దు దాడిలో యువ రైతు మృతి

WGL: వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లికి చెందిన రైతు అన్నారం రవీందర్ (36) మంగళవారం మృతి చెందాడు. ఫిబ్రవరి 25న తన మొక్కజొన్న చేనును దున్నుతుండగా ఎద్దు ఛాతీ, మెడ, నడుము భాగాల్లో తీవ్రంగా పొడిచింది. గాయాలతో హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.