అమరవీరుల త్యాగఫలమే మన ప్రశాంత జీవితం: ఎస్పీ
WNP: దేశం, రేపటి తరాల కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల సేవలను మరువలేమని ఎస్పీ గిరిధర్ అన్నారు. వారి త్యాగఫలమే మనమంతా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నామని తెలిపారు. ధర్మం పక్షాన నిలిచి, బాధితులకు సత్వర న్యాయం, మెరుగైన సమాజ నిర్మాణానికి కృషి చేసినప్పుడే వారికి ఘనమైన నివాళి అందించినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు.