గుప్త నిధుల కోసం 600 ఏళ్ల ఆలయం ధ్వంసం

గుప్త నిధుల కోసం 600 ఏళ్ల ఆలయం ధ్వంసం

ATP: ఎల్లనూరు మండలం చిలమకూరు గ్రామంలో దాదాపు 600 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని గుప్త నిధుల కోసం కొందరు దుండగులు ధ్వంసం చేశారు. చిత్రావతి నది ఒడ్డున ఉన్న శిల్పకళా సంపదకు నిలయమైన ఈ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు ప్రభుత్వం కానీ, ఎండోమెంట్ అధికారులు కానీ ఇప్పటికీ ముందుకు రావడంలేదని గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.