ఈ లింక్‌లతో జాగ్రత్త

ఈ లింక్‌లతో జాగ్రత్త

TG: హోలీ పండుగను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. రంగులు, గిఫ్ట్ వోచర్లు, హోలీ ఈవెంట్ పాస్‌లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయంటూ వాట్సాప్, SMS, సోషల్ మీడియా ద్వారా నకిలీ లింకులను పంపిస్తున్నారు. అయితే ఈ లింకులపై క్లిక్ చేస్తే స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అవ్వడమే కాకుండా, బ్యాంక్ ఖాతాలోని సొమ్ము క్షణాల్లో మాయమయ్యే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.