భవన నిర్మాణానికి శంకుస్థాపన
AKP: ఎలమంచిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో ఓపీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ బుధవారం శంకుస్థాపన చేశారు. హెల్త్ సెంటర్లో వసతి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైద్యులు సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.