ఆర్థిక సంవత్సరం లక్ష్యాల సాధనకు కృషి చేయండి: కలెక్టర్
ELR: రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వివిధ శాఖల లక్ష్యాల ప్రగతికి సంబంధించిన అధికారులతో సమీక్షించారు. ఈ నెల 17, 18 తేదీల్లో కలెక్టర్లతో సీఎం సమావేశంలో తమ శాఖల ద్వారా చేపట్టి, పూర్తి చేసిన లక్ష్యాలను ఆన్‌లైన్ చేయాలన్నారు.