ఉదయం వేళల్లో పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలి : ఏబీవీపీ

NZB: ఏబీవీపీ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ABVP ఇందూర్ జిల్లా కన్వీనర్ ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ మాసం పేరు చెప్పి పదవ తరగతి పరీక్షా వేళల్లో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. వెంటనే ఉదయం వేళల్లో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు