ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

MDK: పాపన్నపేట మండలం పొడిచినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలోని రక్తపరీక్షల గదులు, ఇన్పేషెంట్ వార్డులను పరిశీలించారు. ప్రతిరోజూ హాస్పిటల్కు ఎంతమంది రోగులు వస్తున్నారని, ఈనెలలో ఎన్ని డెలివరీల లక్ష్యం ఉందని, ఇప్పటిదాకా ఎన్ని చేశారని సంబంధిత వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు.