బడిబాటతో విద్య చైతన్యం.. గ్రామంలో ర్యాలీ
BHNG: ఆలేరు మండలం మందనపల్లిలో బడిబాట కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను తెలియజేస్తూ బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి.సయ్యద్ నాయకత్వం వహించారు. ర్యాలీ సందర్భంగా గ్రామంలోని వీధులలో తిరుగుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య సదుపాయాల గురించి ప్రజలకు వివరించారు.