పోలింగ్ సరళిని పర్యవేక్షించిన కమ్మర్ పల్లి ఎస్సై
NZB: పల్లె పోరు ప్రశాంతంగా సాగేందుకు కమ్మర్‌పల్లి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలింగ్ సరళిని పరిశీలించిన ఎస్సై అనిల్ రెడ్డి, ఓటర్లు తమ ఫోన్లను కేంద్రాల వెలుపలే ఉంచాలని సూచించారు. ప్రధాన రహదారులపై వాహనాలను నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎండ పెరుగుతున్న కొద్దీ ఓటర్ల రద్దీ పెరుగుతోందన్నారు.