VIDEO: ఆధ్యాత్మిక వాతావరణంలో రంజాన్ ర్యాలీ
PLD: పెదకూరపాడులో రంజాన్ వేడుకలు అంబరాన్నంటాయి. మండల కేంద్రంలోని 7 మసీదులకు చెందిన ముస్లిం సోదరులు ర్యాలీగా ఈద్గాకు చేరుకున్నారు. 'అల్లాహు అక్బర్' అంటూ ఆ దేవదేవుని స్మరిస్తూ సాగిన ఈ యాత్ర ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మౌజాన్ ముస్తఫా మాట్లాడుతూ.. ప్రతి ముస్లిం ప్రేమ, జాలి, కరుణ కలిగి ఉండాలని ఆకాంక్షించారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు.