బర్లగూడెం చెరువులో ముమ్మరంగా పూడికతీత పనులు

బర్లగూడెం చెరువులో ముమ్మరంగా పూడికతీత పనులు

KMM: కామేపల్లి మండలం బర్లగూడెం పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కూలీలు, ముఠా మేస్త్రిల భాగస్వామ్మంతో చెరువులు, చెక్ డ్యాంలలో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. సుమారు 500మంది కూలీలు పనుల్లో పాల్గొంటున్నారు. అట్టి పనులను ఎంపీడీఓ జి. రవీందర్ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.