'ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి'
SRCL: వికలాంగుల సాధికారతను ప్రోత్సహిస్తూ సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఈ.జ్యోతి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికర సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంను పురస్కరించుకొని తంగళ్లపల్లి మండలంలోని భవిత కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.