అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

AKP: పరవాడ మండలం తానాం గ్రామంలో పలు అభివృద్ధి పనులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ నియోజకవర్గం సమన్వయకర్త గండి బాబ్జితో కలిసి బుధవారం ప్రారంభించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం పై దృష్టి సారించినట్లు తెలిపారు. స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధికి కృషి చేస్తున్నామన్నారు.