అక్కడ పొగాకు అమ్మితే కఠిన చర్యలు: సీపీ

విశాఖ నగర పరిధిలో స్కూల్స్, కాలేజీలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సీపీ కార్యాలయంలో గురువారం అధికారులతో సమావేశమయ్యారు. పొగాకు వల్ల రాష్ట్రంలో ప్రతి ఏడాది 48వేల మరణాలు సంభవిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రోజుకి 250 మంది పిల్లలు పొగాకు వాడుతున్నారన్నారు.