పర్యాటకుల రాకతో కళకళలాడిన హంసలదీవి బీచ్

పర్యాటకుల రాకతో కళకళలాడిన హంసలదీవి బీచ్

కృష్ణా: కోడూరు మండలం హంసలదీవి బీచ్ ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ఏలూరు ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన పర్యాటకులు సముద్రంలో స్నానాలు చేస్తూ సరదాగా గడిపారు. పర్యాటకులు స్నానాలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాలకాయతిప్ప మెరైన్ పోలీసులు సూచనలు జారీ చేశారు.