'పుష్కరాల పనుల్లో వేగం పెంచండి'

'పుష్కరాల పనుల్లో వేగం పెంచండి'

BHPL: కాళేశ్వరంలో జరిగే అంత్య పుష్కరాల పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ రాహుల్ శర్మ కలెక్టరేట్‌లో సమీక్షించారు. మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగే ఈ పుష్కరాలకు సంబంధించి ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులను అదేశించారు. ఘాట్ల అభివృద్ధి, రహదారులు మరమ్మతులు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.