రేపటి నుంచే భారత్-సౌతాఫ్రికా తొలి టెస్ట్
భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు రేపటి నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు జట్లు అక్కడకు చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. WTC పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలవడానికి ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. దీంతో రెండు జట్లు గెలుపు కోసం హోరాహోరీగా పోరాడనున్నాయి. అయితే, సొంత గడ్డపై భారత జట్టును ఓడించడం సౌతాఫ్రికాకు పెద్ద సవాలుగా మారనుంది.