మిగ్-29లో ఎయిర్ చీఫ్ మార్షల్ సోలో సార్టీ

మిగ్-29లో ఎయిర్ చీఫ్ మార్షల్ సోలో సార్టీ

భారత వైమానిక దళ(IAF) అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇవాళ మిగ్-29 యుద్ధ విమానంలో ఒంటరిగా గగన విహారం చేశారు. పశ్చిమ ఎయిర్ కమాండ్‌లోని ఓ కీలక ఫ్రంట్‌లైన్ బేస్ నుంచి ఆయన ఈ సోలో సార్టీని నిర్వహించారు. ఈ సందర్భంగా బేస్ యుద్ధ సన్నద్ధతను, కార్యాచరణ సామర్థ్యాన్ని ఆయన స్వయంగా సమీక్షించారు. ఆయన స్వయంగా యుద్ధ విమానాన్ని నడపడం వైమానిక దళాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.