VIDEO: జోరుగా కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
NZB: ఎడపల్లి మండలంలో 17 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు నేటితో ముగియనున్నాయి. అభ్యర్థులు భారీగా నామినేషన్లు సమర్పిస్తున్నారు. ఈ మేరకు శనివారం ఆయా నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.