రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

నెల్లూరు సిటీ- నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారి పడి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. అతని వయస్సు 50 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. అతను 5.4 అడుగులు ఎత్తు, చామన చాయ రంగు ఉన్నాడు. తెలుపు బ్లూ గీతల చొక్కా, సిమెంట్ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.