నేడు ఉచిత పశు వైద్య శిబిరం
BPT: రేపల్లె మండలం పేటేరులో మంగళవారం ఉదయం 9 గంటలకు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారంతో ఉచిత పశువైద్య శిబిరం జరుగుతుందని మార్కెటింగ్ కమిటీ కార్యదర్శి వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశువులకు ఆరోగ్య పరీక్షలు, దవాఖానాల్లో లభించే మందుల వివరాలను తెలుపుతారని ఆయన పేర్కొన్నారు.