రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి స్వల్ప గాయాలు
నెల్లూరు: ఉదయగిరి పట్టణంలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఒక బైకు గేదెను ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఉదయగిరికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై సీతారామపురానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.