SSB పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
కేంద్ర హోంశాఖకు చెందిన 'సశస్త్ర సీమా బల్'(SSB) 233 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. నిన్నే(మార్చి 21) నోటిఫికేషన్ రిలీజ్ కాగా.. అభ్యర్థులు ఏప్రిల్ 20 లోపు అప్లై చేసుకోవాలి. UR/EWS/OBCలకు పరీక్ష ఫీజు రూ.100. మిగతా కేటగిరీలకు ఫీజు లేదు. ఎంపికైనవారికి నెలకు రూ.25,500-81,100 జీతం ఉంటుంది.