సోమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

సోమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

JN: శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. ఉసిరి, జమ్మి చెట్లకు దీపాలను వెలిగించి దీపారాధన చేశారు. చండిక అమ్మవారి ఆలయంలో అర్చకులు, భక్తులు కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు.