తెనాలిలో మైనర్ దొంగల ముఠా గుట్టురట్టు

తెనాలిలో మైనర్ దొంగల ముఠా గుట్టురట్టు
GNTR: తెనాలి సోనోవిజన్‌లో ఈ నెల 15న జరిగిన భారీ చోరీ కేసును టూ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముత్యంశెట్టిపాలెం, చినరావూరులకు చెందిన మైనర్లను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జనార్ధనరావు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 12 లక్షల విలువైన సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఐప్యాడ్లను స్వాధీనం చేసుకున్నారు.