తహశీల్దార్ కార్యాలయంలో ఆంధ్రకేసరి జయంతి

సత్యసాయి: ముదిగుబ్బ తహశీల్దార్ కార్యాలయంలో శనివారం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు, న్యాయవాది, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చేసిన సేవలను రెవెన్యూ సిబ్బంది స్మరించారు. తహశీల్దార్ నారాయణస్వామి ప్రకాశం పంతుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.