VIDEO: జిల్లాలో యూరియా కోసం రైతుల కష్టాలు

KMM: యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు. పెనుబల్లి మండలం పాతకారాయిగూడెం సొసైటీ వద్ద యూరియా లోడ్ రావడంతో సోమవారం సొసైటీ ముందు రైతులు బారులు తీరారు. పోలాల్లో పని చేసుకునే సమయంలో యూరియా కోసం నానా అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి క్యూ లైన్‌లో ఉన్నా, యూరియా దొరుకుతుందో లేదో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.