కాల్వలపై ఆక్రమణలను తొలగించిన కార్మికులు
CTR: పుంగనూరు పట్టణంలో కాల్వలపై ఆక్రమణలను మున్సిపల్ కార్మికులు గురువారం తొలగించారు. కాల్వలను తరచూ శుభ్రం చేసే ప్రక్రియలో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ ముని వెంకటప్పకు తగు సూచనలు జారీ చేశారు. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో కాల్వలపై ఉన్న కట్టడాలను కార్మికులు తొలగించారు.