సర్పంచ్ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ
జగిత్యాల: జిల్లాలో జరుగుతున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జగిత్యాల జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1276 పోలింగ్ కేంద్రాలలో 134 సర్పంచ్, 946 వార్డులకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి 853 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు.