దొంగలు పడుతున్నారు.. పోలీసుల పెట్రోలింగ్ ఎక్కడ..?
MDCL: ఘట్కేసర్, పోచారం, అన్నోజిగూడ, నారపల్లి ఏరియాల్లో దొంగల బెడద బీభత్సంగా పెరుగుతుంది. గత మూడు నెలల్లో అన్నోజిగూడ అయ్యప్ప స్వామి టెంపుల్ సమీపంలో చైన్ దొంగతనం, మరోవైపు బైకులు, మొబైల్ ఫోన్ల దొంగతనాలు జరిగాయి. వరుస దొంగతనాల పై పోలీసులు చర్యలు చేపట్టడం లేదని, పోలీసులు అన్నోజిగూడలో పెట్రోలింగ్ పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.