VIDEO: భూసేకరణపై వివాదం.. అధికారులను బంధించిన రైతులు
MDK: చౌటకూర్ (M) శివ్వంపేటలో ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణపై ఉద్రిక్తత నెలకొంది. ఎకరాకు రూ.16 లక్షలు ఇస్తామన్న నోటీసులపై ఆగ్రహించిన రైతులు, RI ప్రమోద్, GPT ప్రవీణ్‌లను పంచాయతీ కార్యాలయంలో బంధించారు. రూ. కోటి విలువ చేసే భూమిని రూ.16 లక్షలకు ఇవ్వబోమని రైతులు స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న జోగిపేట CI అనిల్ చేరుకుని వారికి నచ్చజెప్పి అధికారులను విడుదల చేశారు.