పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు
ELR: ద్వారకాతిరుమల మండలం జాజుల కుంట గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై ఎస్సై సుధీర్ అకస్మికంగా దాడులు నిర్వహించారు. మంగళవారం ఎస్సై తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూ.19,300ల నగదు, 3 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.