విద్యార్థినిపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు..!

విద్యార్థినిపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు..!

WGL: జిల్లాలోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై విద్యార్థిని లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. ప్రొఫెసర్‌ అసభ్యకర మెసేజ్‌లు పంపినట్లు విచారణ కమిటీ నివేదికలో వెల్లడైంది. అతన్ని విశ్వవిద్యాలయం విధుల నుంచి తొలగించారు. ప్రతీకార చర్యగా ఆమె పీజీ పరీక్షల జవాబు పత్రాల్లో తక్కువ మార్కులు వేసి ఫెయిల్ చేశారన్న విషయాన్ని యాజమాన్యం కమిటీకి తెలిపింది.