'ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి'
VZM: ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ్ రాజ్ కుమార్ కోరారు. సోమవారం ఎయిడ్స్ దినం పురస్కరించుకుని గజపతినగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం సదస్సు జరిగింది. ఎయిడ్స్ బాధితుల పట్ల ప్రేమతో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది కె సాయి శేఖర్ పాల్గొన్నారు.