శివాలయంలో నెలకొన్న భక్తుల రద్దీ

శివాలయంలో నెలకొన్న భక్తుల రద్దీ

CTR: మహాశివరాత్రి సందర్బంగా ఆదివారం పుంగనూరు పట్టణం 30వ వార్డులోని శ్రీ భోగ నంజుండేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, ధూప దీప నైవేద్యాలను అర్చకులు సమర్పించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించి పరమశివుని ప్రార్థించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.