చిన్నఅలసాపురంలో వ్యక్తికి కరెంట్ షాక్

CTR: పుంగనూరు మండలం చిన్న అలసాపురం గ్రామ సమీపంలోని ఎగువరెడ్డి చెరువు సమీపంలో ఆవుల మేత కోసం వెళ్లిన నారాయణరెడ్డి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఆయన్ను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం.