లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో “యువ వికాసం”

NLG: లయన్స్ క్లబ్ మునుగోడు ఆధ్వర్యంలో గురువారం “యువ వికాస్” కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల, గురుకుల బాలికల జూనియర్ కాలేజీ కమ్మగూడెంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, లక్ష్య సాధనపై ప్రేరణాత్మక ఉపన్యాసాలు అందించారు. విద్యార్థినుల సందేహాలను నివృత్తి చేశారు.