VIDEO: బొల్లికుంటలో శివాజీ విగ్రహం వివాదం
WGL: ఖిల్లా వరంగల్ మండలం బొల్లికుంటలో శివాజీ విగ్రహం ఏర్పాటు అంశం వివాదాస్పదంగా మారింది. భూమి పూజ కోసం వెళ్లిన బీజేపీ శ్రేణులను స్థానిక నాయకులు అడ్డుకున్నారు. అంబేద్కర్ విగ్రహం పక్కన శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని దళితనాయకులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఘటనపై స్థానిక నాయకులు మామునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.