ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి: ఎమ్మెల్యే వేముల
NLG: పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. నకిరేకల్ మున్సిపాలిటీలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.