'క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ లక్ష్యం'

ప్రకాశం: ఒంగోలులోని శర్మ కాలేజీ గ్రౌండ్‌లో బుధవారం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఛాంపియన్‌షిప్ క్రికెట్ టోర్నమెంట్‌ను రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌కు 45 టీంలు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని.. క్రీడాకారులను ప్రోత్సహించడమే తమ లక్ష్యం అని జగదీష్ వెల్లడించారు.