దేవరకొండలో 'స్వీపింగ్ మిషిన్' వాహనం ప్రారంభం..

దేవరకొండలో 'స్వీపింగ్ మిషిన్' వాహనం ప్రారంభం..

NLG: దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో ప్రధాన రహదారులను శుభ్రపరిచే 'స్వీపింగ్ మెషిన్' మున్సిపల్ ఛైర్ పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు సోమవారం ప్రారంభించారు. ఛైర్‌పర్సన్ ప్రత్యేక చొరవతో గత కొంతకాలంగా వినియోగంలో లేని ఈ యంత్రాన్ని, పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఆమె మళ్ళీ అందుబాటులోకి తీసుకువచ్చారు. కమిషనర్ పూర్ణచందర్, సిబ్బంది ఉన్నారు.