'చలిమంటల వాయువులు ఆరోగ్యానికి హానికరం'
WGL: రాయపర్తి మండలం గ్రామాల్లో చలిపులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. పర్యావరణ కార్యకర్త రావుల భాస్కరరావు శనివారం సూచించారు. ప్లాస్టిక్, పేపర్, సీసాలు,పాత టైర్లను కాల్చడం ద్వారా విషపూరిత వాయువులు విడుదలై చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు,కెన్సర్ వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.